పండగ రోజున తీపి వార్త ఒకటి ఫిలింనగర్‌ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా టైటిల్ కన్ఫామ్‌ అయినట్లు టాక్‌. దర్శకధీరుడు రాజమౌళి డైరక్షన్‌ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్‌ సినిమా ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమాకి ఎట్టకేలకు పేరు దొరికిందట. ఈ పేరు కోసం గతకొన్ని రోజులుగా జక్కన్న అండ్‌ టీమ్ విశ్వప్రయత్నాలు చేసింది. అంతేకాదు ప్రేక్షకులను కూడా ఈసినిమా పేరు సజస్ట్‌ చేయమని దర్శకధీరుడు స్వయంగా ప్రకటించాడు కూడా. ఇప్పుడు ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాకి సరైన టైటిల్‌ దొరికిందని తెలుస్తోంది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ లు తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న ఈ సినిమాకి రామ రౌద్ర రుషితం అనే పేరుని పెట్టాలని చిత్రయూనిట్‌ భావిస్తోందట.

ఇక ఇతర భాషల్లో ఈ పేరుని రైజ్‌ రివోల్ట్‌ రివెంజ్‌ గా పెడుతున్నారట. ఎప్పుడూ తన సినిమాలకు కొత్తగా పేరుని పెట్టే రాజమౌళి ఇప్పుడు ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాకి కూడా రామరౌద్రరుషితం టైటిల్‌ ని ఖరారు చేసినట్లు ఇన్‌ సైడ్‌ టాక్. వచ్చే ఏడు జూన్‌ కి ఈ సినిమాని విడుదల చేస్తామని తొలుతు ప్రకటించినా తర్వాత వాయిదాపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపించాయి. మరి దసరాని టార్గెట్‌ చేసుకొని ఈసినిమాని విడుదల చేయడానికే రాజమౌళి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడని టాక్‌ కూడా వినిపిస్తోంది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్‌, సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ నటిస్తోన్న ఈసినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ కీలకపాత్రలో నటిస్తోంది.