Rahul Gandhi: ప్రధాని మోదీ తాను చేయబోయే ప్రసంగానికి భయపడ్డారని, అందుకే తనపై అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ రోజు (పార్లమెంట్లో రాహుల్ ప్రసంగించిన రోజు) మోదీ కళ్లలో భయం చూశానని ఆయన అన్నారు. అదానీ వ్యవహారంపై తాను ప్రశ్నలు వేసినందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని రాహుల్ ధ్వజమెత్తారు. తాను ఎవరికీ భయపడబోనని, ప్రశ్నించడం ఆపబోనని తేల్చి చెప్పారు. తాను వాస్తవాలనే మాట్లాడుతానని చెప్పారు.
అవాంఛిత గర్భం మహిళలకు ఒక పెద్ద సమస్య. పెళ్లైన వెంటనే పిల్లల్ని కనకుండా వాయిదా వేసుకోవాలని భావించే వారికి, బిడ్డకు బిడ్డకు మధ్య తగిన ఎడం ఉండేందుకు మహిళలలు అనేక గర్భ నిరోధక సాధనాలను వాడుతుంటారు. అవి ఫలితాలను ఇస్తాయో, ఇవ్వవో అనే భయం కూడా వెంటాడుతూ ఉంటుంది. దీనికి తోడు కొన్ని సాధనాలతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ కారణంగా చాలా మంది దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు. అలాంటి వారందరికీ […]
ఆర్య సినిమాలో ఒక సిగరెట్ మీద ఇద్దరి పేర్లు రాసుకుని సగం సగం తాగే సీన్ గుర్తుంది కదా. మరీ అలా పేర్లు రాసుకోకపోయిన చాలా మంది సిగరెట్ అలవాటున్న స్నేహితులు సగం సగం తాగుతూ షేరింగ్ చేసుకుంటుంటారు. అయితే.. అలా షేరింగ్ చేసుకుంటున్న ఇద్దరి స్నేహితుల మధ్య చెలరేగిన గొడవ.. చినికి చినికి గాలివానలా మారి ఏకంగా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకునేవరకు వెళ్లింది. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది.
సంపాదించేందుకు చాలా మార్గాలుంటాయి. అందుకు కావాల్సింది క్రియేటివిటీ, కష్టపడే తత్వం. కానీ, నేటి యువతలో కొంత మంది తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. మంచి ఉద్యోగం ఉన్నా.. విలాసాలకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్నారు. గుర్గావ్లో ఇలాగే 25 ఏళ్ల ఓ యువతి ఇలాగే ఇద్దరు యువకులపై ఫేక్ కేసు నమోదు చేసి డబ్బులు డిమాండ్ చేసింది. అడిగినట్టే వారు 2 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది..?
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయటంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు కేసీఆర్. ఈ ఘటనపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. రాహుల్ గాంధీపై వేటు వేయటాన్ని తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీపై వేటు పూర్తిగా అప్రజాస్వామికమని.. ఇది మోదీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని నేతలు దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ.. లోక్ సభ సెక్రటేరియట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ అనర్హత వేటుపై రాహుల్ గాంధీ స్పందించారు. తాను దేశపు గళాన్ని వినిపించేందుకు పోరాడుతున్నానని.. ఈ మార్గంలో తాను ఎంత వరకు వెళ్లటానికైనా సిద్ధమే అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మరోవైపు.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటం మీద బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు, శ్రేణలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు పడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించడంతో రాహుల్ ఎంపీ పదవికి ఆటోమెటిగ్గా అనర్హుడయ్యారని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. అనర్హత వేటు ఒక్కటే కాదు.. గుజరాత్ న్యాయస్థానం విధించిన శిక్షను పైస్థాయి కోర్టులు కొట్టేయకపోతే రాహుల్ 8 ఏళ్లపాటు ఎంపీగా పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడని నిపుణులు చెబుతున్నారు.
మోదీ ఇంటి పేరుతో ఉన్నవారంతా దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నాయకులు మండిపడుతున్నారు. నిజం మాట్లాడేవారి గొంతు నొక్కేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాము సత్యమే మాట్లాడతామని ఆయన స్పస్టం చేశారు.
సభలో అందరిముందు అవమానిస్తూ మోదీ మాట్లాడిన మాటలు తనను బాధించాయని, అందుకు మోదీపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన ప్రకటన చేశారు. మరోవైపు, రాహుల్పై అనర్హత వేటువేసి త్వరలో జరగనున్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. రాహుల్ గాంధీని కావాలనే చిక్కుల్లో పడేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
Rahul Gandhi disqualify: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. రాహుల్ ఇక లోక్ సభ సభ్యుడిగా ఎంతమాత్రం కొనసాగరని లోక్ సభ సెక్రటేరియట్ ప్రకటించింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు నిన్న రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ ప్రకటన చేసింది. కోర్టు తీర్పు వెలువరించి 24 గంటలు గడవక […]