ప్రపంచం లోని వివిధ దేశాలలో ఉన్న తెలుగువారందరి అభిరుచులను పంచుకోవడానికి, మానవ జీవన సరళిలో మంచి చెడులను, ప్రపంచం లోని రాజకీయ విశ్లేషణలను అందరితో పంచుకోవడానికి అంతర్జాల తెలుగు ఎన్ఆర్ఐ (NRI) రేడియో ఒక పెద్ద వేదికను అందరికి అందించింది. ఎందరో రేడియో జాకీలకు (RJ ) అవకాశాలు ఇస్తూ, వారిలోని సృజనాత్మకతను, అభిరుచులను ప్రోత్సహిస్తూ, అందరితో పంచుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్న తెలుగు వారందరికీ, ఇప్పుడు తెలుగు NRI రేడియో వారి గుండె చప్పుడయ్యింది.
ఖండ ఖండంతరాలలో ఉన్న తెలుగు వారందరి గుండె చప్పుడైన తెలుగు NRI రేడియో లో RJ Sowji గారు వ్యాఖ్యాతగా “ఆడుతూ పాడుతూ ” అనే కార్యక్రమం మొదలుపెట్టడం తన జీవనశైలినే మార్చేసిందని , ఎంతో మంది అభిమానులను తనకు దగ్గర చేసిందని తెలిపారు . ఒక సాధారణ గృహిణిగా వుంటూ , తన జీవితాన్ని తన కుటుంబం కోసమే అనుకుంటున్న తరుణం లో , RJ సుబ్బుగారి వలన ఈ రేడియో గురించి తెలిసింది . ఆ రోజు మొదలు 2 .5 సంవత్సరాల ఒక కాలర్ గా ఎంతో మంది RJ’s తో ఒక అనుబంధం ఏర్పడి , రోజు రేడియోలో అన్ని కార్యక్రమాలు వింటూ ఒక మరువలేని అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు . 2 .5 సంవత్సరాలు తరువాత , ఒక రోజు అతిధి వ్యాఖ్యాతగా ( guest rj) గా చేసిన ఆమెను , ఆ షో తన జీవితానికే ఒక మలుపవుతుందని అనుకోలేదన్నారు .
ఈ రోజు తాను ఒక RJ గా ఇంతమంది అభిమానం పొద్దడం చాలా అదృష్టంగా భావిస్తున్నానంటూ , ఎన్నో సలహాలను ఇచ్చి , నిరంతరం తనవెంట వుండే తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహా వ్యాఖ్యాతలు ,
మన రేడియో అధినేతలు , మన రేడియో technicians , అందరి సహాయ సహకారాలతో తాను ఈ రోజు ఈ స్థాయిలో వున్నానని అంటున్నారు మన RJ సౌజి . మన రేడియో అధినేతల సలహాలమేరకు తన కార్యక్రమాలను కొత్తగా మలచుకొని , తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకోవడానికి వేదిక అయ్యింది తెలుగు NRI రేడియో అని మనఃపూర్వకంగా తెలియచేసారు .
అనుకోని ఒక కొత్త పేరుని తనకు ఇచ్చి , తన ఎదుగుదలకి క వేదిక అయ్యిండి ఈ తెలుగు NRI రేడియో. ఎప్పటికప్పుడు RJ ల మంచిచెడ్డలు చూసుకుంటూ , ప్రతిఒక్కర్నీ ప్రోత్సహిస్తున్న తెలుగు NRI రేడియోకి కృతఙయతలు తెలుపారు .
March 25 th న తను RJ గా తన ప్రయాణం మొదలయ్యింది .85 షోస్ ఇప్పటివరకు చేసురన్నారు . వాటిలో 25 interviews , పిల్లలతో చిటపట చిన్నారి టపాసులు అనే కార్యక్రమం ద్వారా 8 మంది చిన్నారులతో ఒక వినూత్న కార్యక్రమాన్ని మొదలు పెట్టారు . “ఇంతకన్నా నేను ఏమి అడగగలను . ఎల్ల వెళ్లాలా మీ ఆదరాభిమానాలు , ఆశీర్వాదాలు ఇలానే వుండాలని కోరుకుంటున్నాను ” అని తన కృతఙయతలను తెలియజేసారు .
తన షో గురించి ఇలా వివరించారు . తనకి చురుకుగా వుంటూ నిరంతరం పాటలు పాడుతూ , పిల్లలతో ఆదుకోవడం ఇష్టమని చెప్తూ ఆ ఆలోచననే తన షో కి “ఆడుతూ పాడుతూ “అని పేరు పెట్టుకున్నారు .ఒక guest RJ గా వచ్చినతనకు , పిల్లలతో ఒక కార్యక్రమం చెయ్యాలనే ఆలోచన వచ్చిందని , అందుకు తన స్నేహతులు , యాజమాన్యం ఎంతో ప్రత్సాహించి సహకరించారని చెప్పారు . తన షో లో ఆట పాటలతో పాటు , చిలిపి ప్రశ్నలు , crazy టాపిక్స్, ఆట పాటలు వుంటాయని కూడా తెలిపారు .
ఎవరైనా ఒక RJ అవ్వాలనుకుంటే తెలుగు NRI రేడియో ఓక మంచి వేడుకని తెలియచేసారు .
NRI Radio management team కి తన కృతఙయతలు తెలియచేసారు , అంతే కాకుండా తన ఈ విజయపరంపరలో తనకు సహకరించిన తన ఆత్మీయ మిత్రులకు , సహRJ లకు ధన్యవాదాలు తెలిపారు RJ సౌజి .