ఎవరి మాట వింటే ఓపిక లేక పడుకుని ఉన్న వారైనా, చిటికలో లేచి ఎంతో ఎనర్జీ తో తమ పనులను చేసుకుంటారో, ఎవరు తన మాటలతో శ్రోతలను వీకెండ్ పార్టీ మూడ్ లోకి తీసుకెళ్ళతారో, ఎవరు తన మాటలతోనే కాదు చేతలతో కూడా ఆపదలో ఉన్నవారికి మానవత్వంతో ఆపాదహస్తం అందించవచ్చని నిరూపించారో, వారే ఖండ ఖండాల్లో ఉన్న తెలుగువారినందరినీ తన మాటల మంత్రంతో కట్టిపడేస్తున్న తెలుగు NRI రేడియో వ్యాఖ్యాత క్రాంతి గారు.
ఇప్పుడు క్రాంతి గారు వ్యాఖ్యాతగా తన ప్రస్థానాన్ని ఎలా మొదలు పెట్టారో, క్రాంతి గారి మాటల్లోనే తెలుసుకుందాము..
క్రాంతి గారు ఇంజినీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తూ, తనకున్న అభిరుచితో ఆల్ ఇండియా రేడియో ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి వ్యాఖ్యాత గా తన ప్రస్తానం మొదలయిందని చెప్పారు. మంచి గాయకులుగా చూడాలని అనుకున్న తన అమ్మ గారి కల ను తీర్చలేకపోయినా, వ్యాఖ్యాతగా తన మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నిస్తున్నందుకు వారి అమ్మగారు ఎంతో ఆనందపడ్డారని తెలిపారు.అలానే హలో ట్విన్ సిటీస్ అంటూ రెయిన్బో ఎఫ్ ఎం (101.9 ) లో కూడా వ్యాఖ్యాతగా చేశానని చెప్పారు. అమెరికా వెళ్లాలన్న తన కల నెరవేరడంతో ఒకటిన్నర సంవత్సరం క్రితం చికాగో లో MNC లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తూ, ఇక్కడ కూడా తనకున్న అభిరుచిని ప్రముఖ అంతర్జాల తెలుగు NRI రేడియో లో, వీకెండ్ పార్టీ అంటూ అమెరికా సెంట్రల్ టైమ్ ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటలు వరకు ప్రతి శుక్రవారము, శనివారము వ్యాఖ్యాతగా కొనసాగిస్తూ శ్రోతలను తన మాటలతో అలరిస్తున్నానని తెలిపారు.
క్రాంతి గారు తన కార్యక్రమంలో ఆ వారాంతం ప్రపంచంలో జరిగిన విశేషాలను తెలుపుతూ, ఆ వారంలో విడుదులైన చిత్రాల గురించి తెలియజేస్తూ, తను వేసిన చిక్కు ప్రశ్నలతో, శ్రోతలకు నచ్చిన మధురమైన సినీ సంగీతాన్ని అందిస్తూ అలరిస్తున్నాని తెలియజేసారు. ఇటు వినోదాన్ని అందిస్తూనే, అటు కళారంగాలలో సేవలు చేసిన ప్రముఖులను తన కార్యక్రమాల్లోకి ఆహ్వానించి వారి గురించి ప్రపంచానికి తెలియజేసే అవకాశం కలిగినందుకు ఎంతో ఆనంద పడ్డానని తెలిపారు. వారిలో గాయనీ గాయకులు లిప్సిక, సందీప్ లు, డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి గారు, హీరో సుధాకర్ గారు ఇలా ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసే సదవకాశం తనకు కలిగినందుకు తెలుగు NRI రేడియో కు తను ఎంతో రుణ పడి ఉన్నానని తెలియజేసారు.
క్రాంతి గారు ఒక వైపు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తూ, ఇంకో వైపు తెలుగు NRI రేడియో లో వ్యాఖ్యాతగా చేస్తూ, సొసైటీకి తన వంతు సహాయం కూడా అందిస్తున్నాని తెలిపారు. ప్రమాద పరిస్థితిలో ఉన్న వారికి రక్తం ఎంత అవసరమో తెలుసుకున్న క్రాంతి గారు తనే రక్త దాన సంస్థను స్థాపించి ఇప్పటి వరకు నూటరెండు మందికి (102)సమయానికి రక్తం అందించి ప్రాణాలను కాపాడగలిగామని తెలియజేసారు. అంతే కాకుండా అనారోగ్యంతో ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్న నలుగురు అభాగ్యులకు, తను సహాయం చెయ్యడమే కాకుండా ఎంతో మందిని వారికి సహాయం జేసేలా చూసి, సమయానికి వైద్యం అందించి వారిని కాపాడగలిగామని తెలిపారు. అంతే కాకుండా అప్పుడే చదువు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాల గురించి, ఇంటర్వ్యూలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వంత వ్యాపారాలు ఎలా మొదలు పెట్టవచ్చొ, వాటిలో తీసుకోవాల్సిన మెళుకువలు గురించి కూడా తనకు తెలిసినవి చెబుతూ ఉంటానని చెప్పారు.
తెలుగు NRI రేడియో లో సేవా దృక్పధంతో వ్యాఖ్యాతగా చెయ్యడం వల్లన , తను ఎంతో మంది ఆత్మీయులకు పరిచయమయ్యానని, ఎందరో ఆత్మీయులవ్వడం తనకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది అని చెబుతూ, ఇక్కడ వ్యాఖ్యాతగా అవకాశం కలిగినందుకు తెలుగు NRI రేడియో మేనేజ్మెంట్ విలాస్ గారికి, వెంకట్ రెడ్డి గారికి, మామ మహేష్ గారికి అలానే తన కార్యక్రమానికి పిలిచే ఆత్మీయులకు కూడా మనః స్ఫూర్తిగా తన కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.
Leave Your Comment Here