మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో మూవీ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతోంది.. దీనికి సంబంధించిన చిరంజీవిలుక్స్ ని రివీల్ చేయబోతోంది చిత్రయూనిట్. అంతేకాదు, ఓపెనింగ్ షూటింగ్ రోజునే టైటిల్ ని కూడా రివీల్ చేస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమాకి స్వయంకృషి అని టైటిల్ ని పెట్టాలని చూస్తున్నట్లుగా సమాచారం. మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి సుమలత కలిసి నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించింది. ఈ సినిమాలో యాక్టింగ్ తో చిరంజీవి తనలోని మరోకోణాన్ని చూపించాడు.
ఇప్పుడు సేమ్ టైటిల్ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ చిరంజీవి సినిమాకే వాడటం అనేది ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది. అయితే, ఈ టైటిల్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. అంతేకాదు, ఈ సినిమాలో హెవీ స్టార్ కాస్టింగ్ ని ప్లాన్ చేసాడట కొరటాల. ఇది కూడా హిందీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటుగా మ్యాట్నీ మూవీస్ కూడా సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీస్కునే ఆలోనలో ఉన్నారు. అంతేకాదు, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలకమైన పాత్రలో చిరంజీవితో కలిసి నటించబోతున్నారని టాక్. అదీ మేటర్.
Leave Your Comment Here