గుర్తుకొస్తున్నాయి ……..
ఈ పేరు లోనే ఎన్నెనో సంగతులు , విశేషాలు , అనుభవాలు , జ్ఞాపకాలు ….ఇలా చాల గుర్తొస్తాయి … ఇలాంటివి ఆలోచిస్తూ నాకు తెలుగు NRI రేడియో ఇచ్చిన ఒక అవకాశం ద్వారా మా పెద్ద అమ్మమ్మ గారైన శ్రీమతి సూర్యకాంతం గారు విశేషాలతో ఈ కార్యక్రమం ( షో) మొదలు పెట్టాను …. అలాగే వారితోపాటు నటించిన వారిని ఈ కార్యక్రమం కి ఆహ్వానించి ….మనకు సినీ రంగంలో సుపరిచితులైన ఎందరో దిగ్గజాలను ఈ కార్యక్రమం ద్వారా మీ అందరితో మాట్లాడిస్తూ …..ఆ తరం వారిని తిరిగి ఈ తరం వారికీ మన ప్రవాసాంధ్రులుకు పరిచయం చేస్తూ వారి ప్రయాణాలు ఇంటి నుండి వారి తల్లిదండ్రుల మీదగా పుట్టి పెరిగిన ఊరులు , బాల్యం ,మొట్టమొదటి నాటకప్రవేశాలు … సినీప్రస్థానాలు … మా అమ్మమ్మగారి తో పరిచయం ….అంటూ ….ఇలా ఇప్పటిదాకా …చేస్తూ మీ అందరి ఆదరాభిమానాలు సంపాదించుకున్నాను 🙏. ఇలాగె మీరు నన్ను ,నా కార్యక్రమం (show ) ని ఆదరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను 🙏🙏🙏. …
ఇది ఒక్కరితో అవ్వదండి … ప్రతిదానికి నంబర్స్ సేకరించటం … వారితో …. వారి మేనేజర్స్ తో మాట్లాడటం …. వారికీ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం చెప్పటం ఒక తారీకు date తీసుకోవటం దానికి ఫ్లయెర్ వేయించుకుని , స్క్రిప్ట్ రాసుకుని డౌట్స్ అడిగి , నమ్మకమును / కాంఫిడెన్స్ తెచ్చుకుని … ఇంటర్వ్యూ చేసేముందు deep breath తీసుకుని మర్యాదగా వారిని రిసీవ్ చేస్కుని …కార్యక్రమం show కి కాల్
చేసే ప్రతి ఒక్క ఆత్మీయులను ఆప్యాయతగా పలకరించి నా కార్యక్రమం కి వచ్చినందుకు గెస్ట్ కి నాకు తీపి జ్ఞాపకాలు ఇచ్చి పుచ్చుకుంటూ … తరవాత YouTube లో వారి సంభాషణ పదిలపరిచి …. ఇలా ఇన్ని చేసి ఇంత మంది ఉంటేనే నా కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి అన్నమాట … ఉన్నమాట.
ఇట్లు
మీ అశ్విని
తెలుగు ఎన్ ఆర్ ఐ రేడియో వ్యాఖ్యాత -గుర్తుకొస్తున్నాయి
Leave Your Comment Here