Delhi Girl: 16 ఏళ్ల బాలికను 20 ఏళ్ల యువకుడు దారుణంగా చంపేశాడు. బాలిక చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. అంత దారుణం జరుగుతున్నా.. అక్కడ ఉన్న వారెవరూ ఆ యువకుడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Destination Wedding: పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక మరపురాని ఘట్టం. దాన్ని జీవితాంతం గుర్తుంచుకునేలా ఉండాలని ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. కొంతమంది ఇళ్లల్లోనే చేసుకుంటుండగా.. మరికొంత మంది ఫంక్షన్ హాళ్లలో జరుపుకుంటారు. ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ బాగా ట్రెండింగ్లో ఉంది. అయితే చాలామంది తమ జీవిత భాగస్వామిని గోవాలో పెళ్లాడాలని భావిస్తారు. అయితే అలాంటి వారికి అక్కడి అధికారులు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటి ? […]
Akhand Bharat Map బీజేపీయే కాదు, హిందుత్వ సంస్థలకు చెందిన ముఖ్య నాయకులు కూడా అఖండ భారత్ అనే భావనను పదే పదే ప్రచారంలోకి తీసుకొస్తుంటారు. తన సైద్ధాంతిక మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ అఖండ భారత్ ఆలోచనను నమ్ముతోందని పలు సందర్భాల్లో బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే, అఖండ భారత్ అనేది తీవ్ర భావజాలం కలిగిన వ్యక్తుల కలగా కొందరు అభివర్ణిస్తారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవనంలో ఈ మ్యాప్ ఉండటం చర్చనీయాంశం అవుతోంది.
Wedding: పెళ్లి పీటల మీద వివాహాలు ఆగిపోవడం ఎన్నో చూసి ఉంటాం. ఆకాశమంత పందిరి వేసి.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని అందరూ కోరుకుంటారు. కొన్ని వివాహాలు సాఫీగా జరిగితే.. మరికొన్ని మాత్రం చివరి నిమిషంలో ఆగిపోతుంటాయి. అలాంటిదే ఒక పెళ్లి సినిమా రేంజ్లో జరిగింది. పెళ్లి పీటలు ఎక్కే ముందు పారిపోయిన యువతి.. చివరికి 13 రోజులకు వచ్చి వివాహం చేసుకుంది. ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడ జరిగింది. ఆ యువతి ఎందుకు అలా చేసింది. […]
Census: దేశంలో మరోసారి జనగణన ప్రక్రియ వాయిదా పడినట్లే కనిపిస్తోంది. మన దేశంలో పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కింపు చేపడతారు. అయితే 2020 లోనే జనగణన చేపట్టాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. అప్పటి నుంచి ఈ ప్రక్రియకు మోక్షం లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనాభా లెక్కింపు చేపట్టాలని నిర్ణయించారు. అయితే అది కూడా జరిగే సూచనలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. […]
ఈశాన్య రాష్ట్రం అసోంలో సోమవారం భయంకరమైన ప్రమాదం సంభవించింది. రాజధాని గువహటి నగరంలో ఓ పై వంతెన వద్ద వేగంగా వచ్చిన కారు.. అదుపుతప్పింది. డివైడర్ను ఢీకొట్టి అవతలివైపునకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు స్పాట్లోనే చనిపోయారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులు అసోంలోని పలు ప్రాంతాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. అయితే, వీరు ఎక్కడకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అనేది మాత్రం తెలియరాలేదు.
Karnataka: ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకు వెళ్లి తిరిగొస్తుండగా వాహనం.. ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా లారీ ముందు భాగంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ సహా ఆరుగురు చనిపోవడం బాధాకరం. రోడ్డు ప్రమాద బాధితులకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు.
GSLV-F12 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రయోగం విజయవంతమైంది. భారత రెండో తరం నావిగేషన్ ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి సోమవారం ప్రయోగించింది. గతంలో నావిగేషన్ సర్వీసెస్ కోసం పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాల్లో నాలుగింటి జీవితకాలం ముగిసింది. ఆ సిరీస్లో భాగంగానే తాజాగా ఈ ఉపగ్రహ ప్రయోగం చేపట్టనుంది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (NavIC) ఇస్రో అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ.
కొన్ని రోజులుగా ఒంటరి మహిళల్ని లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు దొంగలు.. వారి మెడలో బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను తస్కరిస్తున్నారు. ఈ తరహా నేరాలపై నిఘా పెట్టిన పోలీసులు.. దొంగలను ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల కిందట ఓ వంతెన సమీపంలో మహిళ వెళ్తుండగా.. బైక్పై వచ్చిన దొంగలు ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలు కేకలు వేయడంతో పోలీసులు రంగంలోకి దిగి.. దొంగలను వెంబడించి పట్టుకున్నారు.
Nun Body Intact ఓ క్రైస్తవ సన్యాసిని నాలుగేళ్ల కిందట 95 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆమెను ఓ చెక్క పేటికలో ఉంచి పూడ్చిపెట్టారు. అయితే, వారి మత సంప్రదాయం ప్రకారం.. భౌతిక కాయాన్ని సమాధి నుంచి ప్రార్థనా మందిరంలోకి బలిపీఠం కిందకు తరలించారు. ఈ నేపథ్యంలో మే 18న మృతదేహం వెలికి తీయగా.. అద్భుతం ఆవిష్కృతమైంది. ఎంబాల్మింగ్ సహా ఎటువంటి సంరక్షణ చర్యలు తీసుకోకున్నా డెడ్ బాడీ మాత్రం కుళ్లిపోలేదు.
Leave Your Comment Here